![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 983 లో.. శైలేంద్రకి వార్నింగ్ ఇస్తుంది వసుధార. అందరి ముందు నీ నిజస్వరూపం బయటపడటం కామన్. అన్ని ఆధారాలతో నీ నిజస్వరూపాన్ని రిషి సర్ ముందు బయటపెడతాను. నువ్వు జైలుకెళ్ళడం కాయం.. అయిపోయింది శైలేంద్ర.. ఈరోజు తాడో పేడో తేల్చుకుందాం.. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావ్ శైలేంద్ర అని వసుధార వార్నింగ్ ఇస్తుంది. అంటే వసుధార నా వేలితో నా కన్నే పొడిచిందా అని శైలేంద్ర టెన్షన్ పడతాడు. ఆ తర్వాత రాజీవ్ కి శైలేంద్ర కాల్ చేసి.. నీ మరదలు మాములుది కాదు నాకే చెమటలు పట్టిస్తుందని, జరిగిందంతా చెప్తాడు. అందానికి అందం తెలివికి తెలివి ఉంది కాబట్టే నా మరదలి మీద మనసు పారేసుకున్నానుని రాజీవ్ అంటాడు. మీ మామ చక్రపాణిని పట్టుకోమని రాజీవ్ కి శైలేంద్ర చెప్తాడు.
రిషి దగ్గర ఉన్న చక్రపాణి.. వాళ్ళ కూతురు కొడుకు సంతోషంగా ఉండాలని చూడు దేవుడా అని అనుకుంటారు. అప్పుడే చక్రపాణికి అతడి క్లోజ్ ఫ్రెండ్ స్వామినాథన్ ఫోన్ చేస్తాడు. అంటే రాజీవ్ గన్ పెట్టి ఫోన్ చేపిస్తాడు. బాగున్నావా అని మాములుగా మాట్లాడతాడు స్వామినాథన్. నా కూతురు పెళ్ళి కుదిరింది.. మంచి సంబంధం.. మా అల్లుడు బంగారమని ఒప్పుకున్నాను. పెళ్ళి కార్డ్ లు కూడా అచ్చు వేయించి అందరిని పిలుస్తున్నానని చక్రపాణికి స్వామినాథన్ అంటాడు. అవునా సరే మంచిదని చక్రపాణి అంటాడు. పాత అడ్రెస్ కి వెళితే అక్కడ ఉండట్లేదని తెలిసింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావో చెప్పురా మనం కలుద్దామని స్వామినాథన్ అనగా.. నేను బయట వేరే పనిలో ఉన్నాను రా. అయిన కార్డు ఎందుకు.. ఫోన్ లో చెప్పావు కదా సరిపోతుందని నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నానని, ఆ తర్వాత ఒకరోజు కలవడానికి వస్తానురా అని స్వామినాథన్ తో చక్రపాణి అంటాడు. ఇక ఆ తర్వాత స్వామినాథన్ కి చంపేస్తానని రాజీవ్ గట్టి వార్నింగ్ ఇస్తాడు.
కాలేజీలో ఉన్న వసుధార దగ్గరకు అనుపమ, మహేంద్ర వచ్చి.. ఏంటమ్మా నువ్వు చేసింది. రిషి వస్తాడని ఎందుకన్నావని ఇద్దరు అడుగుతారు. ఇంకెన్నాళ్ళు బయపడతాం.. ఇక మనం బయపడొద్దు.. రిషి సర్ రావాలి.. వాడి నిజస్వరూపం అందరికి తెలియాలని చెప్పాను. మా నాన్నకి కాల్ చేసి తీసుకురమ్మని చెప్పానని వసుధార అంటుంది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా.. రిషి ఎప్పుడు వస్తాడోనని శైలేంద్ర వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు బయటకు తీసుకొస్తే ఎలా మరి అని మహేంద్ర అడుగుతాడు. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మావయ్య.. ఫణీంద్ర సర్ కు ఈ రోజు నిజం తెలియాలని వసుధార అంటుంది. ఇక ఇంట్లో ఉన్న దేవయాని తన హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే శైలేంద్ర కాల్ చేసి.. మన ప్లాన్ రివర్స్ అయింది. రిషిని కాలేజీకి తీసుకొస్తుందంట ఆ వసుధార.. నేనయ జైలుకెళ్ళడం కాయమని చెప్తుందని దేవయానితో అనగానే తను షాక్ అవుతుంది. ఇప్పుడేం చేద్దామని దేవయాని అనగానే.. అది తెలియకే నీకు కాల్ చేసానని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |